24-08-2025 08:51:56 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ గ్రామానికి చెందిన బంజే చిన్న ప్రభు లింగం తన నివాస గృహంలో గోల్డ్ షాప్ కోసం షెడ్ వేసి ప్రస్తుతం ఫర్నిచర్ పనులు చేయిస్తున్న సమయంలో, ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి కిరోసిస్ పోసి నిప్పంటించి పారిపోయారు.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యాపారం మార్వాడికి చెందిన వారిది అని కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు. ఎవరు కూడా ఇలాంటి అసత్య/తప్పుడు సమాచారాలను నమ్మవద్దని నేరపూరిత చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.