calender_icon.png 24 August, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

24-08-2025 07:40:01 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): భార్యను హత్య చేసిన భర్తను ఎట్టకేలకు సదాశివ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం తెలిపారు. సదాశినగర్ కు చెందిన చిందం రవి కుటుంబ కలహాల కారణంగా భార్యలక్ష్మిని ఇంటి ముందున్న బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.

హత్యకు ఉపయోగించిన బండరాయి, నిందితుడు ఉపయోగించిన దుస్తులు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని, రవిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. కేసును చకచక్యంగా చేయించి నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నాం సుదర్శన సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ఎస్సై పుష్పరాజు పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు, సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.