calender_icon.png 24 August, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనానికి పాల్పడిన మహిళ రిమాండ్

24-08-2025 07:31:12 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల గొల్లగూడ  గ్రామానికి చెందిన ఇందూరి చంద్రశేఖర్ తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఈనెల 24 న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్లగొర్ల పుష్పలత అనే మహిళలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్ తెలిపారు. తన తమ్ముడికి పెళ్లి సంబంధం చూస్తానని ఈనెల 22 లో తన ఇంటికి వచ్చి తెలిపిందని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తాము మంచిర్యాలకు పెళ్లి సంబంధం చూసేందుకు వెళ్లగా తన ఇంట్లో బీరువా తాళాన్ని రాడుతో పగలగొట్టి 15 వేల నగదు తో పాటు బంగారు నక్లెస్ ను దొంగతనం చేసి గొల్ల తన ఇంటికి వెళ్ళిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈనెల 24న దొంగిలించిన బంగారు నక్లెస్ ను అమ్ముదామని కన్నాల బుగ్గ కమాన్ దగ్గర వేచి చూస్తుండగా తాళ్ల గురజాల ఎస్సై రామకృష్ణ , ఏఎస్ఐ బాబాజీ, కానిస్టేబుల్ తిరుమల ఆమెని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఆమె వద్ద నుండి బంగారు నెక్లెస్, రూ 15000 నగదు స్వాధీనం చేసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు తెలిపారు. ఆదివారం నిందితురాలిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ హనూక్ తెలిపారు.