24-08-2025 08:55:19 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీలో ఆదివారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీని చేపట్టారు. బెల్లంపల్లి వన్ టౌన్ ఏఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి వాహన పత్రాలను పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులకు ఏఎస్ఐ మహేందర్ సూచించారు. ప్రతి ఒక్కరూ వాహన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. తలకు హెల్మెట్ ధరించడంతోపాటు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించాలని కోరారు.