24-08-2025 07:28:57 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మండలం బొందలపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో గత కొన్నేళ్లుగా రాత్రి సమయాల్లో విద్యుత్ దీపాలు లేక చీకటి అలుముకుంది. దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవటంతో పాటు ఇబ్బందులకు గురయ్యేవారు. అయితే గ్రామానికి చెందిన బండారు ఆనంద్ తన సొంత ఖర్చులతో హనుమాన్ దేవాలయం ఆవరణలో సెన్సార్ లతో కూడిన 4 ఫ్లడ్ లైట్ లను బహూకరించి ఏర్పాటు చేశారు. దీంతో గుడిలో చాలా ఏళ్ల తర్వాత లైట్లు ఏర్పాటు చేయటం పట్ల గ్రామ పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు. ఇట్టి మంచి కార్యక్రమం చేపట్టిన దాత బండారు ఆనంద్ ని గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, బాలనాగయ్య, తిరుపతి రెడ్డి, లోకేష్ రెడ్డి, మల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.