ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ మాఫియా
భీమదేవరపల్లి ఆగస్టు 5 (విజయక్రాంతి): కల్తీ ఆహారం అరికడుతున్న విచ్చలవిడిగా పెరుగుతున్న కల్తీ దంద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్తీని అరికట్టాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చె ప్యాల ప్రకాష్ డిమాండ్ చేశారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా పాలల్లో మద్యంలో అల్లం, వెల్లుల్లి, మసాలా రోజువారి వాడుకునే నిత్యవసర సరుకులలో వంటల వాడుకునే మసాలాల నుండి నూనె వరకు పాల నుండి పాల పదార్థాల వరకు కల్తీ రోజురోజుకు విచ్చలవిడిగా పెరుగుతుంది అన్నారు.
కల్తిని ఎంత అరికడితే అంతకు రెట్టింపు కల్తీ మాఫియా చేయడం జరుగుతుంది, కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దృష్టిలో పెట్టుకొని కల్తీ మాఫియా చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేశారు. నిన్నటి రోజు హైదరాబాదులో కూరల్లో వేసే మసాలా ఆవాలు జిలకర టాల్కం పౌడర్లతో కల్తీ చేస్తున్నారు అని లవంగాలు, సాజీర, వాము అనేక రకాల మసాలా దినుసులను కల్తీ చేయడం మూలంగా ప్రజలు ఆరోగ్యం రోజురోజు క్షీణించి వారి యొక్క అవయవాలు పాడైపోతున్నాయి.
మసాలా దినుసులు కూరల్లో పోపులలో బిర్యానీలో లవంగాలు వేసుకుందామంటే భయాం దోళన పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. మసాలా దినుసులను, సింథటిక్ కలర్స్ హెయిర్ కలర్స్ ను కూడా వాడుతున్నారు .ఫ్యాబ్రిక్ డైతో మసాలాలు తయారు చేస్తున్నారు. రాబోయే రోజులలో కల్తీ మసాలా దినుసులను అల్లం, వెల్లుల్లి, పాలు, మద్యం పెరుగు తో పాటు వివిధ రకాల కల్తిని చేస్తూ డ్రగ్స్ గంజాయి పట్నం నుండి పల్లె వరకు వచ్చింది.బెట్టింగ్ యాప్ లతో అనేక మంది విద్యార్థులు చనిపోతున్నారు కాబట్టి ఇటువంటి మాఫియా పైన కఠినమైన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.






