6 August, 2026 | 2:52 AM

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరూ మోసపోవద్దు

06-08-2026 01:57 AM
  1. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
  2. కోరుట్లలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవేర్నెస్

కోరుట్ల, ఆగస్టు 5,(విజయ క్రాంతి): సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరు మోసపోవద్దని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో సైబర్ జాగృతిక దివాస్ సందర్భంగా కళాశాలల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ మాట్లాడుతూ... సైబర్ నేరగాళ్లు మాయమాటలతో మోసాలు చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దని, అంతే కాకుండా ఫోన్ కు వచ్చే మెసేజ్ లకు స్పందించి ఓటీపీలు వంటి సమాచారం చెప్పొద్దని సూచించారు. బ్యాంకు వ్యక్తిగత పిన్ నంబర్లు సైతం గోప్యంగా ఉంచుకోవాలన్నారు.

దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ లక్ష్మి నారాయణ, కళాశాలల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.