6 August, 2026 | 2:37 AM

కొలువుదీరిన నూతన పాలకవర్గం

06-08-2026 01:58 AM

మానకొండూరు, ఆగస్టు 5(విజయ క్రాంతి):కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షునిగా ముద్దసాని శ్రీనివాస రెడ్డి, పాలకవర్గ సభ్యులుగా బొంగోని కనుకయ్య, ఎడ్ల శ్రీధర్, మధునయ్య, కొమ్మగల్ల స్వరూప, మందల బక్కరెడ్డి, గోపు శ్రీనివాస్ రెడ్డి, కంకణాల భూమ్ రెడ్డి, అపురి ప్రేమలత, చింతకాయల రాజేశ్వరి, కనుకుంట్ల స్వామి, వేల్పుల రంగయ్య, తగరం మల్లేషలు పాలకవర్గ సభ్యులుగా ప్రమాణస్వీకారోత్సవం బుధవారం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్,వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రాచారి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపెల్లి సంపత్ గౌడ్ సర్పంచులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.