calender_icon.png 13 September, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన రాజ్యాంగం దిక్సూచి

13-09-2025 03:47:03 AM

మన భారత రాజ్యాంగం.. ఇది కేవలం చట్టాల సమాహారమే కాదు స్వాతంత్య్రంకై పోరాడిన త్యాగధనులు కన్న కలలు, ఆశయాలు, సామాజిక న్యాయం, శాంతియుతంగా సమాజాన్ని నడిపించే మార్గదర్శకాలు.. ఇలా అన్నింటిని కలిగిన ఒక పవిత్ర గ్రంథం. ఇది మన పజాస్వామ్యాన్ని పరిరక్షించే గ్రంథం.

ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి.. ఇతర దేశాల్లో ఏం జరుగుతోందో, అక్కడి రాజ్యాంగాల్లో ఉ న్న లోపాలను ఎత్తి చూపాకా.. మన దేశా న్ని శ్రేయస్కరంగా నడిపిస్తున్న మన రాజ్యాంగం గొప్పదనాన్ని వివరించారు. ఇతర దేశాల్లో ప్రజాస్వామ్య లోపాలు, మానవ హక్కుల సమస్యలు, సమానత్వానికి దూరంగా ఉండే పరిస్థితులు ఉన్న చోట..  భారత రాజ్యాంగం అందించిన హ క్కులు, న్యాయసూత్రాలు, ప్రజల సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యతను వివరించడం గొప్ప విషయం.

ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ప్రజాస్వామ్యం పూర్తిగా నిలదొక్కుకోలేకపోయింది. మతం, జాతి, వివక్ష, న్యాయం, విద్య, ఉపాధిలో  సమాన అవకాశాలు లేక సామాజిక అసమానత పెరి గిపోతున్నది. కానీ మన దేశంలో స్వాతం త్య్రం తర్వాత రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం లింగ, మత, ప్రాంతీయ అసమానతలకు తావు లేకుండా ప్రతీ వ్యక్తికి సమాన హక్కులు, న్యాయంతో పాటు అభివృద్ధికి మార్గం చూపించింది. మన దేశాన్ని భిన్నత్త్వంలో ఏకత్వంగా నిలబెట్టిన అత్యున్నత చట్ట పత్రం రాజ్యాంగం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో.. రాజ్యాంగ సంక్షోభం, హక్కుల మీద దాడులు, ప్రజాస్వామ్య పరిరక్షణలో లోటుపాట్లు, మన రాజ్యాంగానికి ఉన్న విలువను మరింత పెంచాయి.

భారత రాజ్యాంగ ప్రత్యేకతలు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం.. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పిస్తూ, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని లక్ష్యంగా పెట్టు కుంది.  సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ‘ప్రజల గుండె చప్పుడు’గా అభివర్ణించింది.

అనేక కీలక తీర్పుల్లో, రా జ్యాంగానికి విరుద్ధమైన చర్యలను నిరాకరించి, ప్రజల హక్కులను కా పాడింది. కేశవానంద భారతి కేసు లో రాజ్యాంగం మౌలిక నిర్మాణాన్ని కాపాడేందుకు తీర్పునిచ్చింది. అధికార దుర్వి నియోగం, మహిళా హక్కులు, మత, కుల వివక్షతల పట్ల ఎప్పటికప్పుడు తమ తీర్పు ల్లో ఉన్నత న్యాయస్థానాలు ప్రజల హక్కు లు కాపాడుతూ రాజ్యాంగ విలువలను ఇనుమడింపజేశాయి.

విద్య, వైద్యం, ఉపా ధి, కార్మిక, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలకు రాజ్యాంగమే దిక్సూచి. కేంద్రం, రాష్ట్రాల సమన్వయం, శాసన, కార్య, న్యా య శాఖల మధ్య పరస్పర నియంత్రణ వ్య వస్థ మన రాజ్యాంగం సొంతం. ఇతర దే శాల్లో వివక్ష తీవ్రంగా ఉన్న వేళ.. మన భారత రాజ్యాంగం మాత్రం అందరికీ స మాన హక్కులని చాటి చెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు రాజ్యాంగ పరిరక్షకులు గా వ్యవహరిస్తున్నాయి. ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యానికి బలాన్నిచ్చింది. దేశంలోని భాషల వైవిధ్యాన్ని, సంస్కృతిని గుర్తించిన మన రాజ్యాంగం వాటికి సమాన ప్రాధాన్యతను కల్పించింది.

వివిధ దేశాల్లో రాజ్యాంగ లోపాలు

కొన్ని దేశాల్లో సైనిక తిరుగుబాట్లు జరిగి ప్రజాస్వామ్యం దెబ్బతిన్న సందర్భాలు, మైనారిటీ హక్కులు రక్షించబడని దేశాలు, న్యాయవ్యవస్థపై ప్రభుత్వ ఒత్తిడితో ప్రజలకు న్యాయం అందని పరిస్థి తులు  ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛ గా జరగని దేశాలు కూడా చాలానే ఉన్నా యి. ఈ నేపథ్యంలో, భారత రాజ్యాంగం సామాజిక న్యాయానికి, సమానత్వానికి, శాంతియుత రాజకీయ మార్పులకు బలమైన పునాదిగా నిలుస్తోంది.

2006, 2014లో థాయ్‌లాండ్‌లో ప్రజాస్వామ్యం గా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి, సైనిక పాలన అమల్లోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక పాకిస్తాన్‌లో రాజ్యాంగాన్ని నిలిపివేయ డం, న్యాయవ్యవస్థపై ఒత్తిడులు, ఎన్నిక ల్లో లోపాలు చోటు చేసుకున్న సందర్భా లు కోకొల్లలు. పాక్‌కు స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దానికే 1958లో మొదటిసారి సైన్యం తిరుగుబాటు చేసింది. ఆ తర్వాత 1977లో ను సైన్యం తిరుగబాటు చేసింది. 1999లో అప్పటి జనరల్ పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు చేసి నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోసి పాలనను హస్తగతం చేసుకోవడం గమనార్హం.

ఇక మధ్య ఆసియా దేశాలు న్యాయ వ్యవస్థ పై రాజకీయ ఒత్తిడి తీసుకురాగా.. ఆఫ్రికా దేశాల్లో  స్వేచ్ఛ లేని ఎన్నికలతో నిత్యం గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ వస్తున్నాయి. మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలపై 2017లో దేశీయంగా ఒత్తిడి, హింస తో జనాభా తొలగింపులు జరిగి వారికి పౌరసత్వం ఇవ్వకుండా వేధించారు. దీంతో లక్షలాది మంది శరణార్థులుగా భారత్, బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చారు. 2021లో మయన్మార్‌లో  సైనిక తిరుగుబాటుతో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం పడిపోయింది. సైన్యం దేశాన్ని స్వాధీనం చేసుకుని, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎన్నికల అవకతవకలపై ఆరోపణలు చేయడంతో, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన వ్యవస్థ విచ్ఛిన్న మైంది. 

ప్రజాస్వామ్యానికి తూట్లు

సిరియాలో 2011 నుంచి అంతర్గత యుద్ధం కొనసాగుతూ వస్తుంది. కుర్ద్‌లను ప్రధాన రాజకీయ, సైనిక వర్గాల్లో భాగస్వామ్యం చేయకపోవడంతో ప్రాంతీయ వివక్షతో అంతర్గత యుద్ధం కొనసాగుతున్నది. హంగేరీ, పోలండ్ దేశాల్లో ప్రభు త్వాల ప్రభావంతో న్యాయస్థానాలు స్వతంత్రంగా పని చేసే హక్కును కోల్పోయాయి.

ఇక అఫ్గానిస్తాన్ దేశ పరిస్థితులు అందరికీ సుపరిచితమే. తాలిబన్ చెప్పుచేతల్లో ఉన్న ఆఫ్గన్‌లు స్వేచ్ఛా వాయువు హక్కులను ఎప్పుడో కోల్పోయారు. బెలారస్, జింబాబ్వే దేశాల్లో ఎన్నికల్లో అవకతవకలు సర్వ సాధారణం. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష అభ్యర్థులు అరెస్ట్‌లు.. భద్రతాలోపంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకపో వడంతో దొంగ ఓట్ల విహారంతో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచినట్లయింది.

ఆయా దేశాల్లో రాజ్యాంగం లోపాలు.. ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకు, న్యాయానికి, జాతి, మతాల పట్ల ఎంతలా విఘాతం కలిగిస్తున్నాయనేది స్పష్టంగా చూపిస్తుంది. అయితే దీనికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం నిర్మించబడింది. సమానత్వాన్ని, న్యాయాన్ని, స్వే చ్ఛను కాపాడేలా రాజ్యాంగ నిర్మాణం జరిగింది. మౌలిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ.. భారతదేశం ప్రజాస్వామ్యాన్ని బ లంగా కాపాడుతుంది. అలాగే ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పిస్తూ  ప్రపం చానికి మన రాజ్యాంగం దిక్సూచిగా నిలబడింది.

రాజకీయ అస్థిరత..

రాజకీయ అస్థిరత వల్ల గతేడాది బంగ్లాదేశ్‌లో అత్యవసర పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. 2022లో శ్రీలంక విదేశీ అప్పుల సంక్షోభంతో ఆర్థికంగా దెబ్బతినడంతో ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై తిరుగబాటు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాను నిషేధించారన్న కారణంతో నేపాల్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. యువత రోడ్ల మీదకు వచ్చి రాజకీయ నాయకులను తరమి తరిమి కొడుతున్నారు.

గతంలో నేపాల్ రాజు జ్ఞానేంద్ర ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించగా.. విద్యార్థులు, రాజకీయ పార్టీలు, సాధారణ ప్రజలు కలిసి రాజ్యాంగ పునరుద్ధరణ కోసం ఉద్యమించారు.  దీంతో రాజు జ్ఞానేంద్ర ప్రజా స్వామ్యాన్ని తిరిగి స్థాపించి కొత్త రా జ్యాంగం ఆమోదించారు. భారత రా జ్యాంగం.. మన స్వేచ్ఛకు కవచంలా, సమానత్వానికి గోడలా, ప్రజాస్వామ్యానికి ఆధా రంగా నిలబడింది. రాజ్యాంగాన్ని గౌరవించడం, దాని విలువలను కాపాడడం ప్రతి భారతీయుడి కర్తవ్యం. ఇతర దేశాల్లో ఉన్న అసమానతలు, మానవ హక్కుల లోపాలు మనకు హెచ్చరికలాంటివి. కానీ మన దేశాన్ని శ్రేయస్కరంగా, సౌమ్యంగా నడిపేందుకు మనకున్న గొప్ప ఆయుధం మన రాజ్యాంగమే.

 వ్యాసకర్త సెల్: 8466827118