calender_icon.png 5 November, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో ఏఈఈ

30-10-2024 01:29:26 AM

50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

రాజేంద్రనగర్, అక్టోబర్ 29: రూ.50 వేలు లంచం తీసుకుంటున్న జీహెచ్‌ఎంసీ ఏఈఈని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. ఏఈఈ వెంకోబా గతంలో రాజేంద్రనగర్ సర్కిల్‌లో పనిచేశారు. నెల రోజుల క్రితం ఆయన గోషామహల్‌కు బదిలీ అయ్యారు. గతంలో రాజేంద్రనగర్‌లో పనిచేస్తుండగా కాంట్రాక్టులకు సంబం ధించి ఎం బుక్‌లో కొలతలు నమోదు చేసేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేశా రు. ఈ విషయమై బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

ప్రణాళిక ప్రకారం సద రు కాంట్రాక్టర్ మంగళవారం సాయంత్రం అబిడ్స్‌లోని ఓ హోటల్‌లో రూ. 50 వేలు ఇస్తుండగా కాపుకాసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈఈ వెంకోబాకు కెమికల్ పరీక్ష నిర్వహించగా లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు అధికారులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.