01-01-2026 12:44:36 AM
పలువురు అభినంధనలు
అశ్వారావుపేట డిసెంబరు 31(విజయ క్రాంతి): జనవరి 1 నుండి 31వ తేదీవరకు డిల్లీలో జరిగే డిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపుకు ఆశ్వా రావుపేట వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ శ్రావణం కావ్యశ్రీ .ఎం పికయ్యారు. బుధవారం కళాశాలలో కావ్యశ్రీకి ఎంపికైన ధృవీకరణ పత్రాన్ని కళాశాల అసోసియేట్ డీన్ డా. హేమంత్ కుమార్ అందజేసారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అక్టోబరు 31వ తేదీనుండి నవంబర్ 9వ తేదీవరకు నార్త్ గుజరాత్ యూనివర్శిటీలో జరిగిన విశ్వవిద్యాలయ ం మరియు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో కావ్యశ్రీ గెలుపొందింది.
ఈ ఎంపికలో గెలుపొంది డిల్లీలో జరిగే రిపబ్లికి పరేడ్ క్యాంపుకు ఎంపికై కళాశాలకు పేరుతెచ్చారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ హేమంత కుమార్ మాటాడుతూ క్రమశిక్షణ, సేవా బావం, నాయకత్వ లక్షణాలు, జాతీయ స్ఫూర్తితో ఆమె సాదించిన ఈ విజయం కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఈమెను ఆదర్శంగా తీసుకొని ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో విద్యార్థులు మరింత చురుకుగా పాల్గొనాలన్నారు. ఈ విజయానికి కారణమైన ఎన్‌ఎస్‌ఎస్ 13. ప్రోగ్రాం ఆఫీసర్లు డి స్రవంతి. పీ ఝాన్సీరాణి, అధ్యాపకులను ఆయన అభినందించారు.