04-01-2026 12:52:06 AM
అసెంబ్లీలో మంత్రి తుమ్మల వెల్లడి
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): సం క్రాంతి పండుగ నుంచి వ్యవసాయ యాంత్రీకరణ ప్రారంభమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే వ్యవసాయ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేశారని మంత్రి పేర్కొన్నారు. రైతు బంధు, రైతు రుణమాఫీతో పా టు వ్యవసాయ అనుబంధ పనులకు దాదాపు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సోయా, మక్కలను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముం దుకు రాకపోతే ..రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని మంత్రి వివరించారు.