06-01-2026 02:13:00 PM
హైదరాబాద్: వరంగల్ కోట భూముల ఆక్రమణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) లేఖ రాశారు. వరంగల్ కోట భూములను(Warangal Fort lands) పురావస్తుశాఖవిగా గుర్తించాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కోట పరిసరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. ఆక్రమణదారులపై పురావస్తుశాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కోట భూములను ఏఎస్ఐ భూములుగా రికార్డుల్లో సవరించాలన్నారు. వరంగల్ కోట చుట్టూ 7 ప్రాకారాల్లో 3 మాత్రమే మిగిలాయని, మిగిలిన ప్రాకారాల భూముల్లో అక్రమ నిర్మాణాలున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఆక్రమణలపై ఏఎస్ఐ అధికారులు(ASI officials) నోటీసులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కోట చుట్టూ ఉన్న మట్టి గోడ, రాతి గోడలను ధ్వంసం చేస్తూ ఆక్రమిస్తున్నారని సూచించారు. చారిత్రక సంపదను కాపాడటంలో ప్రభుత్వం చొరవ చూపాలని లేఖలో పేర్కొన్నారు. వరంగల్ కోట పరిరక్షణకు ఏఎస్ఐ కి ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు.