calender_icon.png 7 January, 2026 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8861 ఫైర్ యాక్సిడెంట్ ఘటనలు

06-01-2026 02:52:10 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపకశాఖపై అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమాధానం ఇచ్చారు. గతేడాది 8,861 అగ్నిప్రమాదాల్లో 163 మంది మృతి చెందగా, రూ. 879 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని పొన్నం తెలిపారు. రాష్ట్రంలో 138 ఫైర్ స్టేషన్లు, 9 ఔట్ పోస్టులు, 544 ఫైర్ సేఫ్టీ వాహనాలు ఉన్నాయని వెల్లడించారు. 

సంగారెడ్డి దగ్గర సిగాచి అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే ఇంట్లో 17 మంది చనిపోయారని తెలిపారు. చర్ల ,దేవరకద్ర ,కల్లూరు ,గుండాల , బోథ్,కొంకచర్ల ,రుద్రంగి , జయనాథ్ మండలం హెచ్ క్యు,బయ్యారం , తూప్రాన్, పాశమైలరం ,జిన్నారం , బీబీ నగర్, ఉప్పల్ బగాయత్, బాచుపల్లి , ఘట్కేసర్ లు తదితర ప్రాంతాలకు కొత్తగా 58 అగ్నిమాపక కేంద్రాలు వచ్చాయన్నారు. గౌలిగూడ,సికింద్రాబాద్ , ఓల్డ్ మారేడు పల్లె , ఖైరతాబాద్ , మియాపూర్ తదితర ప్రాంతాలకు స్థాయి పెంచామని వివరించారు. పెరుగుతున్న 18  అంతస్తులు ,104  అంతస్తుల బిల్డింగ్ కి సంబంధించి మిషనరీ ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పారు.

గేటెడ్ కమ్యూనిటీ, ఆసుపత్రులు పరిశ్రమలు, విద్యాలయాలు ఫైర్ సేఫ్టీ పై 13658 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అగ్నిప్రమాదాలు జరగకుండా చూడడం వస్తె ప్రమాదం నుండి ఎలా కాపాడుకోవాలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది నియామకాలు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విద్యుత్ లూస్ కేబుల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, దాని ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఫైర్ సేఫ్టీ అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం వెల్లడించారు.