calender_icon.png 7 January, 2026 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగద్గిరిగుట్టలో కీచక ప్రిన్సిపాల్‌కి దేహశుద్ధి

06-01-2026 01:53:25 PM

హైదరాబాద్: పదోతరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్(principal)కు దేహశుద్ధి చేశారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని(Jagadgirigutta Police Station) చంద్రగిరినగర్ లోని ప్రైవేట్ స్కూల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబసభ్యులు ఆగ్రహంతోప్రిన్సిపల్ విజయ్ కుమార్ ను చితకబాదారు. పాఠశాలపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అనంతరం ప్రిన్సిపల్ విజయ్ ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.