calender_icon.png 7 January, 2026 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు గ్రామాలలో నులి పురుగు నిర్మూలన కార్యక్రమం

06-01-2026 02:38:13 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్, అక్కంపల్లి గ్రామాలలో మంగళవారం మండల వైద్యాధికారి  రవికుమార్ గొర్రె మేకలకు నులి పురుగు నివారణ మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిషత్ వైద్యాధికారి  రవికుమార్ మాట్లాడుతూ... గొర్రె మేకల యజమానులు తప్పనిసరి నులిపురుగు నిర్మూలన మందులను వేయించాలని సూచించారు. రెండు గ్రామాలలో 825 గొర్రెలకు, 568 మేకలకు నులిపురుగు నిర్మూలన మందులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సర్పంచ్ యాదవ్ గౌడ్, అక్కంపల్లి సర్పంచ్ వెంక గౌడ్, పశు వైద్య సిబ్బంది గౌస్తో పాటు గొర్రె మేకల యజమానులు తదితరులు పాల్గొన్నారు.