04-01-2026 12:50:18 AM
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : పీఎం మోదీపై చేసిన వ్యాఖ్యలకు గానూ.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మరెవ రూ.. ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయకుండా, సభా మర్యాదలు పాటించేలా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘మోదీకి తలకాయ లేదు. మోదీ మైండ్‌కు పరీక్షలు చేయాలి’ అ ని ప్రధాని నరేంద్ర మోదీపై కూనంనేని సాం బశివరావు చేసిన వ్యాఖ్యలు హేయమైనవని అన్నారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై, దే శాభివృద్ధికి అహోరాత్రులు కష్టపడుతూ, అంతర్జాతీయ స్థాయిలో దేశ గౌరవాన్ని పెం చుతున్న దార్శనిక నాయకుడి పట్ల.. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కూనంనేని రాజకీయ దివాలాకోరుతనాన్ని బయటపెట్టాయని విమర్శించారు. రాజకీయాల్లో హూందాతనం, పరిణితి అవసరం... అంతేకానీ ప్రధానమంత్రిపై వ్యక్తిగత దూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని, ప్రజలు అన్నీ గమనిస్తుంటారనే విష యం గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయ వ్యవస్థపై ఏవగింపు కలుగుతోందని తెలిపారు.
అందుకే ప్రజలకు దూరమయ్యారు: ఎంపీ డీకే అరుణ
పీఎం మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసి న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఎక్స్ వేదిగా తెలిపారు. దేశవ్యాప్తంగా కమ్యూనిజం తన ఉనికిని కోల్పోయిందని, ఇలాంటి బాధ్యతారాహిత్యమైన భాషను వాడ టం వల్లే వారు ప్రజలకు దూరమయ్యారు అనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో, మరీ ముఖ్యం గా శాసనసభలో ఇటువంటి భాషకు ఏమాత్రం చోటులేదని, తెలంగాణ అసెంబ్లీలో ఇటువంటి వ్యాఖ్యలను అనుమతించి, వాటిని చూసి నవ్వడం ద్వారా స్పీక ర్, కాంగ్రెస్ ప్రభుత్వం తమ మిత్రపక్షాన్ని కాపాడటానికే ప్రాధాన్యం ఇచ్చాయి తప్ప, సభ గౌరవాన్ని కాపాడలేకపోయాయని తెలిపారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ రాజకీయాలు మాత్రం కేవలం తిట్లు, దూషణలు..
అప్రస్తుత అంశాలకే పరిమితమై ఉన్నాయని, కూనంనేని సాంబశివరావు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎంపీ అరుణ డిమాండ్ చేశారు.