06-01-2026 02:34:29 PM
హైదరాబాద్: గతంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ(District reorganization) మొక్కుబడిగా జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. ఒకే నియోజకవర్గంలోని 4 మండలాలు 4జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని మంత్రి తెలిపారు. మంత్రివర్గంలో చర్చించి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపడతామని వెల్లడించారు. శాసనసభలో చర్చించి అందరి ఆమోదంతో పునర్ వ్యవస్థీకరణ చేస్తామన్నారు.