calender_icon.png 7 January, 2026 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల, ప్రజల సమస్యపై ఉక్కు పాదం

06-01-2026 12:42:25 PM

సర్పంచ్ శ్రీనివాస్ రావ్

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఎస్సి హస్టల్‌లో విద్యార్థుల వాష్‌రూమ్ సమస్యకు పరిష్కారం. విద్యార్థులను దృష్టిలో ఉంచుకోని వారు ఎన్నాళ్ళ నుండి పడుతున్న ఇబ్బంది చూడలేక వారి సమస్యలు తీర్చడానికే పాడైపోయి ఉపయోగానికి అనర్హంగా మారిన వాష్‌ రూమ్‌లను పూర్తిగా తొలగించి, నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు.

అలాగే గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు సిర్గాపూర్ నుండి చాప్ట మీదుగా నారాయణఖేడ్ వెళ్లి వస్తుంటారు, సిర్గాపూర్ నుండి చాప్ట మధ్యలో రోడ్డు దెబ్బతిన మోకాలు లోతు గుంతలతో వాహన దారులకు, రైతులకు, తండా వాసులకు అబ్బింది కరంగా మారిన గుంతలను పూడ్చివేయించారు. ఈ సందర్బంగా సర్పంచ్ శశ్రీనివాస్ రావ్ మాట్లాడుతూ...ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి సహకారంతో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత దృష్ట్యా ఈ సమస్యను ప్రాధాన్యత, ప్రత్యేక చొరవ తీసుకుని పనులు నాణ్యతతో, వేగంగా పూర్తయ్యేలా చూస్తానని అన్నారు.