calender_icon.png 21 August, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ కొట్టండి.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ పొందండి

13-08-2024 12:07:55 PM

అమరావతి:విద్యుత్ శాఖలో అక్రమార్కులకు చెక్ పట్టడం ఎలా అనే విషయంలో ఏపీఈపీడీసీఎల్ వినూత్న మార్గాన్ని అవలంబించనుంది. గత రెండేళ్లలో పట్టుబడిన ఏసీబీ కేసులలో సగం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు డబ్బులు డిమాండ్ చేసి దొరికి పోయినవే ఉన్నాయి. దీంతో ఈ కనెక్షన్ల మంజూరు విధానంలో మార్పులో భాగంగా ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ లిమిటెడ్ ఈ చర్యలు చేపట్టింది. ఇకపై సచివాలయం, మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండా 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే చాలు రిజిస్ట్రేషన్ అయ్యే విధానాన్ని అమలులోకి తెచ్చారు. తదనంతరం ప్రభుత్వ అనుమతి రాగానే ప్రాధాన్య క్రమంలో రైతుల జాబితాను అనుసరించి రైతులకు కనెక్షన్లు ఇస్తామని  అధికారులు తెలిపారు.