calender_icon.png 21 August, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై కోల్ కతా హైకోర్టు విచారణ

13-08-2024 01:40:59 PM

కోల్ కతా: వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై మంగళవారం కోల్ కతా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్ కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటనపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటికే రాజీనామా చేసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ను మరో కాలేజీకి అధికారులు బదిలీ చేశారు. మరో ప్రభుత్వ కళాశాలకు ప్రిన్సిపల్ గా నియమించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి అధికారులు ఎందుకు అండగా ఉంటున్నారని ప్రశ్నించిన కోర్టు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ప్రిన్సిపల్ బాధ్యతల నుంచి తప్పుకుంటూ సెలవు దరఖాస్తును ఈరోజు మధ్యాహ్నం 3 గంటలలోగా సమర్పించాలని, అలాగే మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వాంగ్మూలం నమోదు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.