13-08-2024 11:33:04 AM
హైదరాబాద్ సిటీ: పాఠశాలల్లో హాజరు శాతం పెంచడంతోపాటు పిల్లలకు నాణ్యమైన విద్యా బోధన అందించేలా ప్రధానోపాధ్యాయులను ప్రోత్సహించేందుకు తొలిసారిగా ‘కాఫీ విత్ కలెక్టర్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ వారం విద్యార్థుల హాజరు శాతం పెంచిన 10 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.