రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెతావత్ రామకృష్ణకు పదవి
నియామక పత్రం అందించిన జాతీయ అధ్యక్షులు డా.ఉదిత్ రాజ్
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సంఘాల సమా ఖ్య తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెతావత్ రామకృష్ణను నియమిస్తున్నట్లు ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షులు, మాజీ పార్లమెం టు సభ్యులు ఉదిత్ రాజ్ ప్రకటించారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌లో మూడు రోజుల పాటు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉదిత్ రాజ్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సంఘాల సమాఖ్య జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో రామకృష్ణ కు 21 రాష్ట్రాల అధ్యక్షులు, ప్రతినిధుల సమక్షంలో ఇందుకు సంబంధించిన నియామక పత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగ వ్యాప్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల అభ్యున్నతికి రామకృష్ణ కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నట్లు డాక్టర్ ఉదిత్ రాజ్ తెలిపారు.
ప్రస్తుతం రామకృష్ణ హైదరాబాద్ డివిజన్ ఆర్డీఓగా, డిప్యూటీ కలెక్టర్ల సంఘం జనరల్ సెక్రటరీగా, తెలంగాణ ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూనే గత కొన్ని సంవత్సరాలుగా భారత రాజ్యాంగ వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉదిత్ రాజ్, రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వర్ రాజ్ లకు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను అత్యంత నిష్ఠతో నెరవేర్చి ఆర్గనైజేషన్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.






