calender_icon.png 11 July, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కేర్’లో ఏఐ ఆధారిత రోబోటిక్ సర్జరీ

11-07-2025 12:00:00 AM

అధునాతన స్ట్రైకర్స్ మాకో రోబోటిక్ సిస్టమ్ ప్రారంభం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 9 (విజయక్రాంతి): హైటెక్ సిటీలోని కేర్ హాస్పిట ల్స్ వైద్య రంగంలో మరో ముందడుగు వేసింది. అత్యాధునిక ఏఐ  ఆధారిత స్ట్రైకర్ మాకో రోబోటిక్ సర్జరీ సిస్టమ్‌ను గురువారం ప్రారంభించింది. ఇది తెలంగాణలో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలకు ఒక కొత్త దశను చూపనుంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నాలతో కలిసి ప్రారంభించారు.

మాకొ రోబో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స లో మరింత ఖచ్చితత్వం మరియు ప్రతి రోగి కి తగిన విధంగా చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల శస్త్రచికిత్స ఫలితాలు మెరుగవుతాయి, రోగులు త్వరగా కోలుకుంటారు. ఈ కార్యక్రమంలో కేర్ హాస్పిటల్స్ గ్రూప్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్, గ్రూప్ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ అశోక్ రాజు గొట్టెము క్కల, డాక్టర్ వాసుదేవ జువ్వాడి, డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ శరత్‌బాబు, ఇత ర సీనియర్ డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

‘తెలంగాణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అధునా తన ఏఐ ఆధారిత రోబోటిక్ సాంకేతికతను జోడించడం మన రాష్ట్ర ప్రగతిని సూచిస్తోందని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా మాట్లాడుతూ.. “ఏఐ, రోబోటిక్స్ ఇక భవిష్యత్ సాంకేతికత కాదు. ఇవే ఇప్పుడు జరుగుతున్న యథార్థం. ఇవి ఖచ్చితమైన వైద్యం, శస్త్రచికిత్సా విధానాలను నిర్వహిస్తాయి” అని చెప్పారు. కేర్ హాస్పిటల్స్‌కు తమ మాకో రోబోటిక్ సిస్టమ్‌ను అందించడం గర్వంగా ఉన్నదని స్ట్రైకర్ బీయూ డైరెక్టర్ మను కండ్పాల్ అన్నారు.