11-07-2025 12:00:00 AM
ఖైరతాబాద్, జూలై 10: కూకట్‌పల్లిలో జరిగిన కల్తీ కల్లు ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సి ంహ తెలిపారు. పంజాగుట్ట నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన గురువారం పరామర్శించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.
20లక్షల పరిహారం ఇవ్వాలి: కేటీఆర్
కూకట్‌పల్లి కల్తీకల్లు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.20 లక్షల ఎ క్స్‌గ్రేషియా ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ఘటన బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కల్తీకల్లు తాగి మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.10 లక్షలు, బాధితులకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ని మ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ప రామర్శించారు. ఎక్సైజ్ అధికారులు కల్లు కా ంపౌండ్ నిర్వాహకులతో కుమ్మక్కు కావడ ంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.