calender_icon.png 15 November, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐ ఆధారిత స్కానింగ్ క్యాంపు ప్రారంభం

15-11-2025 12:40:09 AM

నల్గొండ క్రైం నవంబర్ 14: పోలీస్ సిబ్బంది ఆరోగ్యఓ కోసం ఏఐ ఆడారిత స్కానింగ్ క్యాంపును ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా క్షయ నివారణ కేంద్రం సహకారంతో ఆధునిక ఏఐ టెక్నాలజీతో కూడిన X- రే స్కానింగ్ ఆరోగ్య శిబిరం ను ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన పరికరాలతో ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలలో మొబైల్ శిబిరంనిర్వహించబడుతుందని అన్నారు.

శిబిరంలో ఛాతి కి సంబంధించిన వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోగలరని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏ ఆర్ డి.ఎస్పి శ్రీనివాసులు, ఆర్‌ఐ సంతోష్, డాక్టర్ ప్రదీప్,రవి ప్రసాద్,జమాల్,సూపర్వైజర్ బి. అనిల్ కుమార్, ఎం సైదులు, వెంకటరెడ్డి,సయాదుద్దీన్, ఇనాయత్ అలీ,లెనిన్ తదితరులు పాల్గొన్నారు