11 April, 2026 | 10:06 AM

ఏఐఏడీలో ఏఐ ఆధారిత సేవలు

02-12-2024 02:47 AM

సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ సునీల్‌కుమార్ కోతావార్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1(విజయక్రాంతి): ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్ డెంటిస్ట్రీ(ఏఐఏడీ)లో పేషెంట్లకు ఏఐ ఆధారిత సేవలు అందుబాటులో ఉన్నాయని ఆ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ సునీల్‌కుమార్ కోతావార్ పేర్కొన్నారు. ఏఐఏడీ సొసైటీ 13వ వార్షికోత్సవం సంద ర్భంగా ఆ సొసైటీ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న డెంటిస్టుల సేవలను గుర్తిస్తూ సన్మా నించారు.

ప్రాంతీయ డెంటల్ ఆస్పత్రుల్లో పేదలకు అవసరమైన వారికి సేవలందించిన ప్రత్యేక డెంటిస్టులకు ఫెలో షిప్‌లు అందజేశారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎన్ స్వామి మాట్లాడుతూ డెంటిస్టులు ఆధునిక క్లినికల్ నైపుణాన్ని కలిగి ఉండాలన్నారు.

ప్రత్యేకాతిధులుగా డాక్టర్ ఎం ప్రతాప్‌కుమార్, మిడ్స్ ప్రిన్సిపాల్ నిజామాబాద్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చలపతిరావు పాల్గొన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ రాకేశ్ మొహదే, డాక్టర్ అవినాశ్ క్షర్, డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ బాలసునీల్ కుమార్, డాక్టర్ సత్యనారాయణనాయుడు పాల్గొన్నారు. 700 పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ నవీన్ కొక్కుల ధన్యవాదాలు తెలిపారు.