11 April, 2026 | 8:10 AM

న్యాయశాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి

02-12-2024 02:42 AM

అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మారెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (విజయక్రాంతి): న్యాయశాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బోద లక్ష్మారెడ్డి, దక్షిణ భారత విభాగం ప్రతినిధి జగన్నాథం, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రమణారావు కోరారు. సిటీ సివిల్ కోర్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారంతా.. ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ మంజూరు చేయాలని, పదోన్నతులు కల్పించాలని, జీపీఎఫ్, పదవీ విరమణ పొందిన వారికి వస్తువుల బిల్లులు మంజూరు చేయాలని, సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న న్యాయశాఖ ఉద్యోగుల కేసులను పర్యవేక్షించాలని, నూతనసంవత్సరం క్యాలెండర్, డైరీ నిర్వహణ తీర్మానా లను ఆమోదించారు. సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రేమ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌరెడ్డి కోటేశ్వర్‌రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.