calender_icon.png 8 January, 2026 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయూలో ఏఐ డే సెమినార్

06-01-2026 12:31:49 AM

ఘట్‌కేసర్, జనవరి 5 (విజయక్రాంతి) : వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) విభాగం, టెక్ అమ్యూస్, ఏ2ఐ  క్లబ్లు ఐఈఈఈ సిఐఎస్ ల సహకారంతో  ఏఐ డే అనే శీర్షికతో ఒక పూర్తి దిన కార్యక్రమాన్ని సోమవారం ఈ-బ్లాక్ ఆడిటోరియం సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించింది. కార్యక్రమం ప్రారంభంలో కృత్రిమ మేధస్సు విభాగాధిపతి డాక్టర్ ఎ. మల్లికార్జునరెడ్డి ప్రారంభ వ్యాఖ్యలు చేశారు.

అనంతరం స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్  విజయ్ కుమార్ ప్రసంగిస్తూ విద్యారంగం, పరిశోధన వృత్తిపరమైన అభివృద్ధిలో కృత్రిమ మేధస్సు ప్రాధాన్యత వేగంగా పెరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రవంత్ కుమార్ సమర్థవంతంగా నిర్వహించగా, ఆయన యొక్క సుదీర్ఘ ప్రణాళిక సమర్థమైన అమలు కార్యక్రమ విజయానికి ప్రధాన కారణమయ్యాయి.

విద్యార్థి సమన్వయకర్తల సహకారంతో అన్ని సెషన్లు సజావుగా సాగాయి. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ముఖ్య అతిథులు మరియు పరిశ్రమ నాయకులు అధికారికంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఏఐ ఎనీ టైం సంస్థ సీఈఓ అండ్ వ్యవస్థాపకుడు సోను కుమార్, కూడ్రి ఏఐ సీఈఓ వెంకట తలాటం, ఇండోబాక్స్ ఇంక్ (జపాన్) సీఈఓ డైసుకే టాంజి, హస్త గ్లోబల్ ఎమ్డీ అండ్  సీఈఓ పృథ్వి పావులూరి, యూనిటీ సర్కిల్ సీఈఓ  సనాథన్ సెల్వన్, టీపాట్ గేమ్స్ సీఈఓ సతీష్ చంద్ర, జిడిజి హైదరాబాద్ లీడ్  అర్షద్ దేవానీ, హెచ్ వైడిపివై, పైకాన్ స్పీకర్  కల్యాణ్ ప్రసాద్, దమన్ ప్రెన్యూర్ అండ్ మీడియా హెడ్ రాజ్ మీసా, నివున ల్యాబ్స్ వ్యవస్థాపకుడు  అనుదీప్ పేడ్డి జటాయువ్ ఏఐ వ్యవస్థాపకుడు  సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

వారు కృత్రిమ మేధస్సులో తాజా ధోరణులు, పరిశ్రమ సవాళ్లు మరియు భవిష్యత్ అవకాశాలపై విలువైన అవగాహనను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, సీఈఓలు, వ్యవస్థాపకులు ఏఐ అభిరుచి గల వారు ఉత్సాహంగా పాల్గొని చర్చలు ప్రశ్నోత్తర సెషన్లలో పాల్గొన్నారు.