06-01-2026 12:30:29 AM
మేడ్చల్ ఆర్బన్ జనవరి 5 (విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని నూతన్ కల్ లో అంగన్వాడి సమస్యల గురించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని డబిల్ పూర్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ సద్ది సురేష్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన్ కల్ లో రెండు అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని రెండు అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడి ఉపాధ్యాయులు లేక ఒక కేంద్రం పూర్తిగా మూసి వేయడం జరిగిందని రెండవ అంగన్వాడి కేంద్రంలో వేరే మున్సిపల్ పట్టణం నుండి ఇన్చార్జితో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు.
అదే అంగన్వాడికి ఆయమ్మ లేక పిల్లలకు ఇబ్బంది జరుగుతుందని కాబట్టి నూతన్ కల్ ప్రజల కోరిక మేరకు రెండు అంగన్వాడి కేంద్రాలకు ఇద్దరు అంగన్వాడి టీచర్ లను ఆయాలని ఏర్పాటు చేసి సమస్యలను తీర్చాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్టు సురేష్ రెడ్డి వెల్లడించారు.
ముఖ్యంగా నాలుగు వేలకు పైచిలుకు జనాభా గల నూతన్ కల్ లో గర్భిణీ స్త్రీలకు పోషక ఆహార విషయంలో అంగన్వాడి పిల్లలను పంపే విషయంలో ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారని ఆయన స్పష్టం చేశారు.అదేవిధంగా నూతన్ కల్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక ఆశా వర్కర్ పోస్టు చాలా ఘనంగా ఖాళీగా ఉందని సురేష్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో నూతన్ కల్ గ్రామ మాజీ సర్పంచ్ చిన్నోళ్ల కవిత జీవన్.మండల మాజీ కోఆప్షన్ సభ్యులు రుక్సానా యూనిస్ పాషా.బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భాస్కర్ మాజీ వార్డు సభ్యులు తలారి భూషణం తదితరులు పాల్గొన్నారు.