06-01-2026 12:31:50 AM
మిడ్‌మానేరులో రూ. 1,000 కోట్లు, కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో రూ. 500 కోట్లు, బుద్ధారం కెనాల్ నిర్మాణంలో రూ. 30 నుంచి 40 కోట్ల వరకు అక్రమాలు
ఆరోపణలపై విచారణను పూర్తిచేసి నివేదికలు అందించిన విజిలెన్స్
విజిలెన్స్ కమిషన్ కార్యాలయానికి చేరిన నివేదికలు
ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురుచూపు
పట్టించుకోని సర్కారు పెద్దలు
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి) : గడిచిన పది, పదిహేను సంవ త్సరాలుగా నీటిపారుదల శాఖలో జరిగిన అనేక అవినీతి, అక్రమాలు, అవకత వకలపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వేగంగా స్పందించి విచారణ జరిపింది. అన్ని సాంకేతికాంశాలు పరిశీలించింది. అక్రమాల నిగ్గుదే ల్చింది. ముఖ్యంగా కాళేశ్వరంపై ప్రభు త్వం నుంచి విచారణకు ఆదేశాలు వచ్చిం దే తడవుగా.. పకడ్బందీగా విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందించింది.
విజిలెన్స్ విచారణలో బయటపడ్డ వాస్తవాలను, అలాగే విజిలెన్స్ నివేదికలను కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మెచ్చుకుని తమ నివేదికలోనూ అవే అంశా లను పొందుపర్చింది. దీనితో విజిలెన్స్ విచారణ పకడ్బందీగా, లోతుగా చేశారనే ప్రశంసలు సర్వత్రా వచ్చాయి. అయితే, మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణానికి సం బంధించి రూ. 1,000 కోట్ల అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరిగాయని లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందడంతో.. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు రంగంలోకి దిగారు.
అలాగే కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో రూ. 500 కోట్ల వర కు, బుద్ధారం కెనాల్ నిర్మాణంలో రూ. 30 నుంచి 40 కోట్ల వరకు అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులు అంద డంటో విజిలెన్స్ విభాగం అదే వేగంతో అంతే పకడ్బందీగా విచారణను చేపట్టింది. విచారణ అనంతరం సిద్ధం చేసిన మూడు నివేదికలు కూడా విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరి నెలల కాలం అయ్యింది. ప్రభుత్వానికి మాత్రం చేరడం లేదు. ప్రభుత్వం నుంచి పచ్చజెండా ఊపితేనే.. ఈ విజిలెన్స్ నివేది కలకు మోక్షం కలుగుతుందనే విమర్శలకు ఊతమిస్తున్నాయి.
ఇంతటి ముఖ్య మైన విజిలెన్స్ నివేదికలపై రాష్ట్ర ప్రభు త్వం ఎందుకు దృష్టి సారించడం లేదనే చర్చ అధికారవర్గాల్లోనూ మొదలయ్యిం ది. మిడ్ మానేరుపై విచారణ సందర్భంగానే అప్పటి నీటిపారుదల శాఖ ఈఎన్ సీని అక్కడి నుంచి మార్చాల్సి వచ్చింది. కారణం.. మిడ్ మానేరులో ఈ అవకతవకలు జరిగినప్పుడు ఆయన మిడ్ మానేరు సీఈగా బాధ్యతలు నిర్వర్తించారు.
బీఆర్‌ఎస్ హ యాంలో కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయని, అ లాగే బుద్ధారం కెనాల్ నిర్మాణంలోనూ కోట్ల విలువైన అవకతవకలు జరిగాయని విజిలెన్స్ విచారణలో వాస్తవాలు బయటపడ్డా యని సమాచారం. బయటపడ్డ వాస్తవాలు, అక్రమాలు, అవినీతి, అవకతవకలకు బాధ్యులనుకూడా గుర్తించి పూర్తిస్థాయి నివేదికల ను కమిషన్‌కు పంపించినా.. ప్రభుత్వం మా త్రం ఈ నివేదికలపై దృష్టి సారించకపోవడం గమనార్హం.
ఫిర్యాదులు రాగానే.. ఎంత వేగంగా విచారణకు ఆదేశించారో, విచారణ నివేదికలు సిద్ధం అయిన తరువాత.. అదే స్థాయిలో సర్కారు స్పందించడం లేదనే వి మర్శలు వస్తున్నాయి. మూడు ముఖ్యమైన విజిలెన్స్ నివేదికలు కమిషన్ కార్యాలంలో మూలన పడిఉంటే.. కనీసం వీటిని బయటకు తీసుకొచ్చి, బాధ్యులపై చర్యలకు ఆదేశా లు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కపెట్టినట్టుగా వ్యవహరించడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.