19 June, 2026 | 1:37 AM

హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఏఐపై శిక్షణ

19-06-2026 12:00 AM

హుస్నాబాద్, జూన్ 18: ఉన్నత విద్య కమిషనర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో, జేఎన్టీయూ సహకారంతో హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపికైన విద్యార్థులకు కృత్రిమ మేధ (AI), డిజిటల్ లెర్ని్ంప రెండు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి ప్రారంభించి మాట్లాడుతూ, అన్న-అక్క మెంటార్షిప్ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లె ర్ని్ంప అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు.

రిసోర్స్ పర్సన్గా ఏఐ మాస్టర్ ట్రైనర్ ప్రొఫెసర్ జయశ్రీ విద్యార్థులకు కృత్రిమ మేధ, కోడింగ్ అంశాలపై శిక్షణ అందించారు.నోడల్ అధికారులుగా రాజ్యలక్ష్మి, డాక్టర్ వి. చంద్రమౌళి, శ్రీనివాస్ వ్యవహరించారు. ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులకు బోధన చేయడం ద్వారా కళాశాల విద్యార్థులు సామాజిక సేవలో భాగస్వాములు అవుతారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.కార్యక్రమంలో అధ్యాపకులు అ నిల్ కుమార్, బాలరాజు, నయనాదేవి, ఫాతి మా, సుధామాధురి, కుమారస్వామి, లక్ష్మి, రమేష్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.