20-11-2025 10:26:00 PM
పాపన్నపేట (విజయక్రాంతి): మార్గశిర అమావాస్యను పురస్కరించుకుని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.వి.రవి శేఖర్ రెడ్డి గురువారం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, ఈఓ చంద్రశేఖర్ ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. కార్యక్రమములో మాజీ ఎంపీపీ చందన, నాయకులు ప్రశాంత్ రెడ్డి, నాగరాజు, భరత్ కుమార్, బోరింగ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.