calender_icon.png 21 November, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ నెయ్యి అమ్మే వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

20-11-2025 10:32:22 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ రామా లాడ్జిలో కొంతమంది వ్యక్తులు కల్తీ నెయ్యి అమ్ముతున్నారని సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారుల సహకారంతో దాడి చేసి కల్తీ నెయ్యి అమ్మే వ్యక్తులను గురువారం అదుపులోనికి తీసుకొని అరెస్టు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ వి. సతీష్ వారి సిబ్బంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫుడ్ సెప్టీ అధికారితో కలిసి శ్రీ రామ లాడ్జ్ నందు తనిఖీ చేయగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నలుగురు వ్యక్తులైన మల్లిఖార్జున, కే. శ్రీనివాస్, షిఖరేశ్వర, కే. మల్లిఖార్జులు కల్తి నెయ్యి తాయారు చేయుచుండగా పట్టుకొని, కల్తి నెయ్యి తాయారు చేయడానికి ఉపయోగించే పరికరాలను, వస్తువులను, కల్తి నెయ్యి తాయారు చేసి డబ్బాలలో ప్యాక్ చేసిన సుమారు 65 కేజీల కల్తి నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. కట్టుబడిన నలుగురు ముద్దాయిలను పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ సతీష్ తెలిపారు. స్వాదిన పర్చుకున్న కల్తి నెయ్యి విలువ సుమారు 52,000 రూపాయల వరకు ఉంటుందని కూడా ఆయన తెలిపారు.