calender_icon.png 20 November, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్న ప్రజలు

20-11-2025 10:21:00 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): గత పాల గోల పాలనలో ఎల్లారెడ్డి నియోజకవర్గం వెనుకబడిపోయిందని, స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే మదన్మోహన్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. లింగంపేట మండలం పోల్కంపేట్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు తలారి యాదగిరి, అమ్మరి సాయిలు, తుకారాం, దుర్గ ప్రసాద్, సత్తయ్య ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్  నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో ప్రేరణనిచ్చాయని పేర్కొన్నారు. 

గత ప్రభుత్వ ఎమ్మెల్యేతో పోల్చితే, ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ మోహన్  నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎంతో విస్తృతంగా, ప్రజల జీవితాలను మార్చే విధంగా ఉన్నాయని ఆయన ప్రత్యేకంగా తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, ఉచిత కరెంటు, కొత్త రేషన్ కార్డులు వంటి అనేక పధకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అని అన్నారు. గతంతో పోల్చుకుంటే ఎన్నడూ లేని విధంగా పోల్కంపేట్ గ్రామంలో అభివృద్ధికి నాంది పలికింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వచ్చిన తర్వాతే గ్రామం నిజమైన అభివృద్ధి దిశగా అడుగులు వేసింది” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ కుటుంబంలోకి తలారి యాదగిరి, అమ్మరి సాయిలు, తుకారాం, దుర్గ ప్రసాద్, సత్తయ్యని ఆహ్వానిస్తూ, ఎమ్మెల్యే మదన్ మోహన్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు