calender_icon.png 21 November, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగవైకల్యం చెందిన 8 మంది విద్యార్థులకు ఫిజియోథెరపీ వైద్య పరీక్షలు

20-11-2025 10:29:06 PM

నిర్వహించిన వైద్యులు..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): అంగవైకల్యం చెందిన ఎనిమిది మంది విద్యార్థులకు ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని భవిత సెంటర్లో అంగవైకల్య వైద్యులు అరుణ్ 8 మంది పిల్లలకు ఫిజియోథెరపీ వైద్య పరీక్షలు నిర్వహించారు. పక్షం రోజులకు ఒకసారి నిర్వహించే ఫిజియోథెరపీ వైద్య పరీక్షల ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు భవిత సెంటర్లో ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వైద్యులు అరుణ్ తెలిపారు. భవిత సెంటర్లో ఫిజియోథెరపీ వైద్య పరీక్షల్లో ఐఇఆర్పి సిబ్బంది వెంకటేశం, అంగవైకల్యం చెందిన విద్యార్థుల తల్లితండ్రులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.