calender_icon.png 21 November, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పు ఇచ్చిన వారి వేధింపులు

20-11-2025 10:43:13 PM

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య..

ఎల్బీనగర్: అప్పు ఇచ్చినవారి వేధింపులు... పెండ్లిలో పరువు తీస్తామని బెదిరింపులకు పాల్పడడంతో ఒక యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాహెబ్ నగర్ గ్రామానికి చెందిన పారంద శ్రీకాంత్(32), హయత్ నగర్ కు చెందిన నలుగురు వ్యక్తుల దగ్గర నుంచి అప్పుగా రెండు లక్షల రూపాయలు తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చిన వారు చాలా వేధింపులు పెట్టడంతో పాటు నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. డబ్బులు సంబంధించిన విషయంలో పెళ్ళికి ముందు డబ్బులు ఇవ్వకపోతే మీ ఇంటికి తాళాలు వేసి రోడ్డుమీద లాగుతామని ఫోన్లో బెదిరించడంతో సదరూ శ్రీకాంత్ వారి నుంచి నాకు మరణమే శరణ్యంగా మారిందని ఒక వీడియో తీసి సాహెబ్ నగర్ గ్రూపులో సెండ్ చేశాడు.

ఆ వీడియోలో తల్లిదండ్రులను నన్ను క్షమించండి అని ఏడుస్తూ, నాకు చావు తప్ప వేరే మార్గం లేదు మన ఆలోచనతో నేను చనిపోతున్నాను. నాకు చావుకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని వారికి ఎన్ని సార్లు సందయించిన నా పెళ్లి అయిన తర్వాత మీ యొక్క డబ్బులు ఇవ్వాల్సిన అన్ని టోటల్గా అప్పుడు చెప్తామని చెప్పిన వినకపోవడంతో వారు ఇంటికొచ్చి నా ఇజ్జత్ తీస్తారని భయంతో పురుగుల మందు మందుల కలుపుకొని తాగాడు. హరిహర పురం కాలనీలోని కప్పలచెరువు కట్టమీద మందులో విషం కలుపుకొని తాగి అక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున వాకర్స్ స్థానికులకు సమాచారం ఇచ్చి పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఈ మేరకు మృతుడు తండ్రి నరసింహ ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం సెక్టార్ ఎస్సై జటావత్ రవి నాయక్ తెలిపారు. మృతునికి తల్లి ఇద్దరు తమ్ముళ్లు అక్క ఉన్నారు.