calender_icon.png 20 November, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటరు జాబితా ప్రచురణ

20-11-2025 10:23:38 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో ఓటరు తుది జాబితా షెడ్యూల్ను ప్రచురించారు. పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను మరోసారి సవరించేందుకు ఎన్నికల సంఘం కార్యాచరణ చేపట్టింది. ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో ఓటరు తుది జాబితా షెడ్యూల్ను ఎంపీడీవో కార్యాలయంలో ప్రచురించారు. పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను మరోసారి సవరించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈనెల 20వ తేదీ నుంచి 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితాల సవరణ కోసం గురువారం షెడ్యూల్‌ను ప్రకటించింది. 

ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(State Election Commissioner) ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం.. గతంలో వెల్లడించిన జాబితాలో నమోదు కాకుండా ఇటీవల కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఇదివరకు ఉన్నవాటిలో తప్పుల సవరణ, అభ్యంతరాల స్వీకరణనను గురువారం చేపట్టనున్నారు. 21న ఓటరు దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం చేపట్టనున్నారు. 23న పంచాయతీ, వార్డుల వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాల ప్రచురణ చేపట్టనున్నట్లు ఎస్‌ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యక్రమంలో ఎంపీడీవో, ఈవోపీఆర్డీ సిబ్బంది పాల్గొన్నారు.