calender_icon.png 23 August, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎంసీపీఐయు ధర్నా

23-08-2025 01:12:15 AM

నర్సంపేట,(విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ విమర్శించారు. శుక్రవారం నర్సంపేటలోని ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారని, సీజనల్ వ్యాధులతో ప్రజలు రోగాల బారినపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వారికి ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించడంలో పాలకులు అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులకు కావలసిన రుణాలను ఏ బ్యాంకులలో ఇవ్వడం లేదని రైతులకు రుణాలు మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డిఓ ఉమారానికి అందజేశారు.