23-08-2025 12:00:00 AM
కొత్తపల్లి, ఆగష్టు 22(విజయక్రాంతి):కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో ఎం.జి.ఎన్.ఆ ర్.ఇ.జి.ఎస్. నిధులు సుమారు 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని శుక్రవారం రోజున సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కొత్తపెల్లి మండల మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత- మహేష్ లతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు.
ఈజీఎస్ నిధులతో పశువుల పాకలు నిర్మించుకున్న రైతులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, ఖాజపూర్ మాజీ సర్పంచ్ ఇల్లందుల రాజమ్మ,కొత్తపల్లి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు సాబీర్ పాషా, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్,
మాజీ ఎంపీటీసీ కమల- మనోహర్,సింగిల్ విండో డైరెక్టర్ లింగయ్య, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్లు తిరుపతి ,శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్, మండల స్పెషల్ ఆఫీసర్ పవన్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో లక్ష్మి, ఎంపీఓ నరసింహారెడ్డి,అధికారులు స్పందన, భువనచంద్ర, మాజీ ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలుపాల్గొన్నారు.