సీజ్‌ఫైర్ ఉన్నా యుద్ధం ఆగలేదు! లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు… ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన నెతన్యాహు నిర్ణయం
- కాల్పుల విరమణను పట్టించుకోని ఇజ్రాయెల్
- సీజ్‌ఫైర్‌ను స్వాగతిస్తున్నామంటూనే యుద్ధం కొనసాగింపు
- 1౦ నిమిషాల్లో 1౦౦ చోట్ల పేలుళ్లు
- భవన సముదాయాలు, సాధారణ గృహాలు నేలమట్టం
- వందలాది మంది మృతి.. వేలాది మంది క్షతగాత్రులు
- లెబనాన్‌పై దాడులు ఆగవు: నెతన్యాహు
టెల్‌అవీవ్/బీరుట్, ఏప్రిల్ 7: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రేరేపి తం చేయడం వల్లే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా ఇరాన్‌పై దాడులకు దిగారని యావత్ ప్రపంచం భావించింది. కానీ, యుద్ధం విషయంలో ఇరాన్ ప్రతిపాదించిన 1౦ అంశాలకు లోబడి ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణ నిర్ణ యం తీసుకున్నప్పటికీ, నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఇలాంటి అంతర్జాతీయ యుద్ధ వార్తలపై మరిన్ని అప్డేట్స్ కోసం మా National News చూడండి.
అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్తూనే, నెతన్యాహు ఏకంగా 1౦చోట్ల లెబనాన్‌పై వైమానిక దాడులు చేయించారు. వందలాది మం ది లెబనానీయన్లను పొట్టనపెట్టుకున్నారు. వేలాది మంది క్షత్రగాత్రులవడానికి కారణమయ్యారు. తద్వారా, యుద్ధంపై ఏ దేశం ఎలాంటి నిర్ణయం తీసుకుకున్నా, తాము మాత్రం యుద్ధోన్మాదాన్ని ఆపబోమనే సంకేతాలించ్చారు. తమ దారి తమదే అన్నట్లు ఒంటెద్దు పోకడ పోతున్నారు. ‘ఎటర్నల్ డార్క్‌నెస్’ పేరుతో ఇజ్రాయెల్ సైన్యం 50 యుద్ధ విమానాను రంగంలోకి దింపింది.
1౦ నిమిషాల వ్యవధిలో 160 బాంబులను కురిపించింది. దాడుల కారణంగా బీరూట్, బెకా వ్యాలీ వంటి నగరాలు, పట్టణాల్లోని మౌలిక సదుపాయాలు నేలమట్టమయ్యాయి. వేలాది భవనాలు ధ్వంసమ య్యాయి. దాడుల్లో వందలాది మంది చనిపోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. హెజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అమయాక ప్రజల ప్రాణా లు బలయ్యాయని లెబనాన్ ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
ఇజ్రాయెల్ దాడులకు బదులిస్తాం : హెజ్బుల్లా
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంపై హెజ్బుల్లా అసహనం వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం కేవ లం ఇరాన్‌కు మాత్రమే పరిమితమని, లెబనాన్‌పై ఇజ్రా యెల్ దాడులను ఆ ఒప్పం దం ఆపలేదని పేర్కొంది. తమ భూభాగంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తున్నంత కాలం తాము విశ్రమించేది లేదని స్పష్టం చేసింది.
తాజా బ్రేకింగ్ న్యూస్ కోసం మా Vijayakranthi News హోమ్‌పేజీని సందర్శించండి.
ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమని తేల్చిచెప్పింది. ఇరాన్‌తో కుదిరిన శాంతి చర్చల్లో లెబనాన్ ప్రయోజనాలను ప్రపంచ దేశాలు విస్మరించకూడదని డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ ‘ఎటర్నల్ డార్క్‌నెస్’ పేరుతో సామాన్య ప్రజలను చంపుతోందని తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
హెజ్బుల్లాపై దాడులు ఆగవు: నెతన్యాహు
అమెరికా,- ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. అమెరికా తీసుకున్న నిర్ణయానికి తాము సం పూర్ణమైన మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని తేల్చిచెప్పారు. ఇరాన్ అణు, క్షిపణి, ఉగ్రవాద చర్యల నుంచి ఇతర దేశాలకు ముప్పు వాటిల్లకుండా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరిచేందు కు ముందుకు రావడం, ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై కాల్పుల విరమణను స్వాగతిస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన— ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు
అమెరికా-ఇరాన్ యుద్ధం: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన, 10 డిమాండ్లు వెలుగులోకి
యుద్ధానికి బ్రేక్ — అమెరికా-ఇరాన్ 2 వారాల సీజ్‌ఫైర్, కానీ హోర్ముజ్ మళ్లీ మూత!
పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. మృతుల సంఖ్య 570కు చేరింది
లెబనాన్‌లో రసాయన దాడి?.. ఇజ్రాయెల్‌పై ఆరోపణలు
ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌కు షాకిచ్చిన స్పెయిన్ — సైనిక విమానాలకు అనుమతి నిరాకరణ




