పంజాబ్ మాజీ సీఎంకు అకాల్ తఖ్త్ శిక్ష
టాయ్‌లెట్‌లు, వంటగదిని శుభ్రం చేయాల్సిందిగా సుఖ్‌బీర్ సింగ్‌కు ఆదేశం
అమృత్‌సర్, డిసెంబర్ 2: పంజాబ్ మాజీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు సిక్కుల అత్యున్నత సంస్థ ‘అకల్ తఖ్త్’ శిక్ష విధించింది. సుఖ్‌బీర్ రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసు కోవడంతోపాటు మతపరమైన తప్పులు చేసినట్టు పేర్కొంది. అందు కు శిక్షగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంతోపాటు ఇతర గురు ద్వారాల్లో టాయ్‌లెట్‌లు, వంటగదిని శుభ్రం చేయాలని ఆదేశించింది.
2015లో వివాదాస్పద డేరాగా సచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీ మ్ సింగ్‌కు క్షమాభిక్ష పెట్టడాన్ని తప్పుపట్టింది. ఈ క్రమంలో అకల తఖ్త్ జతేదార్, గియానీ రఘ్‌బీర్ సింగ్ సహా మరో నలుగురు ప్రధాన మతాధికారులు సుఖ్‌బీర్ సింగ్ మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడిన ట్టు ఆగస్టు 30న ప్రకటించారు. సుఖ్‌బీర్‌తోపాటు 2015లో ఆయన కేబి నెట్‌లో ఉన్న నాయకులకు కూడా ఈ శిక్ష వర్తిస్తుందని పేర్కొన్నారు.






