బెయిల్ వచ్చిన వెంటనే మంత్రిగా బాధ్యతలా?
సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు విస్మయం
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి బెయిల్ లభించిన కాసేపటికే మం త్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టారు. దీంతో సుప్రీం కోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసిం ది. అవినీతి ఆరోపణలపై అరెస్టయిన వ్యక్తి మంత్రి వర్గంలో చేరడం వల్ల సాక్షులు ఒత్తిడికి గురువుతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇదే సందేహం ప్రతిఒక్కరికి కూడా వస్తుందని అభిప్రా యపడింది.
మంత్రి సెంథిల్ బాలా జీ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా బాలాజీ బెయిల్ ర ద్దుకు నిరాకరించింది. తదుపరి విచారణ ను డిసెంబర్ 13కు వాయిదా వేసిం ది. సెంథల్ 2011 15 మధ్య రవా ణా మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో అవినీతికి పాల్పడ్డారని ఈ డీ ఆయన్ను అరెస్ట్ చేసింది. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 26 న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా బయటకొచ్చిన వెంటనే స్టా లిన్ మంత్రివర్గంలో చోటు దక్కింది.






