14 July, 2026 | 4:51 AM

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ

14-07-2026 12:00 AM

నేరేడుచర్ల, జూలై 13 : జాతీయ నులిపురుగుల నిర్మూలన(నేషనల్ డివర్మింగ్ డే )కార్యక్రమం ను  మున్సిపల్ చైర్మన్ కొనతం.చిన్న వెంకట్ రెడ్డి,జి.ప.ఉ. పా, నేరేడుచర్ల నందు ప్రారంభించి,విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణి చేశారు.ఈ సందర్బంగా వైద్యాధికారిని  డా. పున్న నాగిని, మాట్లాడుతు,విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి మరియు ఆల్బెండజోల్ మాత్ర ల ఉపయోగo గురించి అవగాహన కల్పించి ఆల్బెండజోల్ టాబ్లెట్ వేయడం జరిగినది.

19 సo.ల ప్రతి ఒక్క పిల్లలు మింగాలని ఇదే విధంగా 1- 2స o.ల పిల్లలు 1/2 టాబ్లెట్,2- 3స o. ల పిల్లలు1 టాబ్లెట్,3- 19స o. ల పిల్లలు1 టాబ్లెట్ నమిలి మింగాలిని తెలియజేస్తూ,ఈ రోజు వేయని పిల్లలకు 20- 07- 2026 న మ్యాప్ అప్ డే రోజున వేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు,కౌన్సిలర్ ఇంజమూరి.శ్రీకాంత్,Y. లక్ష్మి,తాళ్ల సురేష్ రెడ్డి, తిరపతి రావు, శ్రీను, హెడ్మాస్టర్ బట్టు మధు,సల్వాది శ్రీనివాస్,సూపర్ వైజర్ ధనమ్మ,  హెల్త్ అసిస్టెంట్స్ నరసయ్య సునీత,ఉపాధ్యాయులు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.