బెల్టుషాపుల్లో సిట్టింగులు.. దాబాలు వెలవెల
- బెల్ట్ షాపుల్లో మద్యం సిట్టింగుల గోల
- నిబంధనలను పాతర వేసి బెల్ట్ షాపుల జోరు
- నెలసరి మామూళ్లలో జోగుతున్న ఎక్సైజ్, పోలీస్
- బెల్ట్ షాపుల నియంత్రణ ను పట్టించుకునేది ఎవరు..?
- దాబా హోటళ్లను మించి బెల్ట్ షాప్ లలో సిట్టింగులు జోరు
- కాసుల కక్కుర్తికి పడి చోద్యం చూస్తున్న ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు
- వైన్స్ యజమానుల నజరానాలకు కక్కుర్తి పడుతున్న అధికారులు
- పట్టణాల్లో గ్రామాల్లో జోరుగా బెల్టు షాపులలో మద్యం అమ్మకాలు
నిజాంసాగర్, మార్చి 10 (విజయక్రాంతి): మద్యం దుకాణాలలో మద్యం విక్రయాల కంటే బెల్ట్ షాపులలోనే మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని వైన్ షాపుల నిర్వాహకుల తీరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూళ్లకు కక్కుర్తి పడుతున్న ఎక్సైజ్, పోలీస్‌అధికారులు బెల్ట్ షాప్ ల వైపు కన్నెత్తి చూడడం లేదు.
అదే దాబా హోటల్లో మాత్రం మద్యం సెట్టింగులను అడ్డుకుంటున్నారు. వైన్ షాపు యజమానులతో ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు కుమ్మక్కై నెలసరి మామూళ్లకు తల్లోగి. బెల్ట్ షాపుల విక్రయాలకు ప్రోత్సహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. యువత ప్రధానంగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయిస్తుండడంతో గ్రామాలలో పట్టణాలలోని కాలనీలో మద్యం సేవిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు.
మద్యం సేవిస్తే పోలీసులు అడ్డు కొని ఫైన్ లు ఒక వైపు వేస్తూ మరోవైపు వైన్ షాపులా యజమానులకు పరోక్షంగా సహకరిస్తుండడంతో బెల్టు షాపుల విక్రయాలు వైన్స్లను తలపిస్తున్నాయి. గ్రామాలలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బెల్టు షాపుల్లో సిట్టింగ్లపర్వం కూడా కోన సాగిస్తున్నారు. బెల్ట్ షాపుల్లో సిట్టింగులు జరుగుతున్న విషయం ఎక్సైజ్ అధికారులకు, పోలీస్ అధికారులకు తెలిసిన మద్యం విక్రయాలను ఏదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. బెల్టు షాపులు వైన్స్లను, బార్ లను తలపిస్తున్నాయి.
గ్రామాల్లో జోరుగా బెల్ట్ షాపులులో అమ్మకాలు
గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వాహకులతో వైన్స్ యజమానులు కుమ్మక్కై ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులతో కుమ్మక్కై జుక్కల్ నియోజకవర్గం లో వైన్ షాపుల నిర్వాహకు ఇల్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలోని వైన్ షాపుల ద్వారా జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని కిరాణా షాపుల్లో మద్యాన్ని విక్రయించే బెల్ట్ షాపుల దందా రోజురోజుకు పెరిగిపోతుంది.
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేక చొరవతో జుక్కల్ నియోజకవర్గం లోని 161 జాతీయ రహదారిపై గల దాబా హోటల్ల లో . మండల కేంద్రాల్లోని దాబా హోటల్లో మద్యం సిట్టింగుల పరంపర పూర్తిగా నిలిచిపోయిన. స్థానిక ఎక్సైజ్ ,పోలీస్ అధికారుల నిర్లక్ష్యంతో ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మద్యపానం నిషేధం అమలు చేస్తున్న నాలుగు గ్రామాలు తప్ప 23 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామానికి ఒకటి నుండి నాలుగు బెల్ట్ షాపుల చొప్పున బెల్ట్ షాపుల దందా జోరుగా కొనసాగుతోంది.
డాబా హోటల్లో సిట్టింగులు పూర్తిగా నిషేధం లో ఉండడంతో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుల్లో సిట్టింగుల దంద జోరుగా కొనసాగుతోంది. వైన్స్ షాపుల నిర్వాహకుల బరి తెగింపులకు ఎక్సైజ్ అధికారుల అండదండలు పూర్తిగా ఉండడంతో గ్రామా ల్లో బెల్ట్ షాపుల నిర్వాహకులు ఆడింది ఆట పాడింది పాటగా విచ్చలవిడిగా మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
దాబా హోటల్ల లో మద్యం సేవించడం ఆరికట్టిన పోలీసు అధికారులు గ్రామాల్లోని బెల్ట్ షాపుల ద్వారా విచ్చల విడిగా మద్యం విక్రాయించడం అక్రమ మద్యం సిట్టింగులను అరికట్టడంలో ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు గ్రామాల్లో వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం సెట్టింగులు ఏర్పాటు లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు
బెల్ట్ షాపులను నిరోధించాలి
గ్రామాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ షాపులను నిరోధించాలి. బెల్ట్ షాపుల ద్వారా మధ్యాన్ని విక్రయిస్తుం డంతో చిన్న పిల్లల సైతం బెల్ట్ షాపులోకి వెళ్లి మధ్యాన్ని తీసుకువస్తున్నారు. ఇలాంటి సంస్కృతి భావితరాలకు మంచిది కాదు.
- -మంగలి ఎల్లయ్య అచ్చంపేట గ్రామం నిజాంసాగర్ మండలం




