11 March, 2026 | 4:38 AM

గాండ్లపెట్ పెద్దవాగు నుంచి రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు

11-03-2026 12:54 AM

మోర్తాడ్, మార్చి 10 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గము మోర్తాడ్ మండలంలోని గాండ్లపెట్ పెద్ద వాగు నుంచి అధికారిక పార్టీ నాయకులు అక్రమంగా ఇసుకను తవ్వుతూ రాత్రిళ్లు రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

భూగర్భ జలాలను ఇంకి పోయేలా, రైల్వే బ్రిడ్జి కింద,బ్రిడ్జ్ సమీపములో కూడా ఇసుకను తవ్వుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కమిటీలకు డబ్బులు ఇస్తూ ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ డంపులు ఏర్పాటు చేస్తున్నారని. ఇటీవలే జిల్లా కలెక్టర్ అక్రమ ఇసుకని తరలిస్తే ఊరుకునేది లేదని కఠిన చర్యలు తీసుంకుతామని హెచ్చరించిన వాటిని లెక్క చేయకుండా  అక్రమ ఇసుకను రాత్రి వేళల్లో ప్రజలు నిద్రపోయే సమయంలో దర్జాగా ఇసుక దందా కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.

రైల్వే బ్రిడ్జ్ వద్ద ఇసుకను త్రోవ్వడం వలన ఆ బ్రిడ్జ్ కు ప్రమాదం జరిగే అవకాశాలు లేకపోలేదు.ఇసుక తరలిస్తున్న సమయంలో   చిన్నపాటి గొడవలు జరగడంతో మంగళవారం ఉదయం ఎమ్మార్వో ఎస్త్స్రలు వచ్చి డబ్బులు సీజ్ చేసినట్టు సమాచారం.దీనిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.తహశీల్దార్గాండ్లపెట్ నుండి ఇసుక అక్రమతరలింపు పై మాకు సమాచారం లేదు,ఈరోజు వెళ్లి సీజ్ చేస్తామని తెలిపిన కొంత సమయానికే వెళ్లి సీజ్ చేశారు. తహసీల్దార్ కృష్ణ. ఇసుక కావాలని దరఖాస్తులు వచ్చినాయి కానీ ఏ పాయింట్ నుండి ఇవ్వాలని చూస్తున్నామని తెలిపారు.