07-10-2025 02:47:35 PM
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అమ్మకాలు చేస్తున్న పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, అక్రమ బెల్లం రవాణాకు ఆజ్యం
తెలిసినప్పటికీ ఎక్సైజ్ సిబ్బందిపై ఎస్హెచ్ ఓ చర్యలు తీసుకొని వైనం
తుంగతుర్తి,(విజయక్రాంతి): గ్రామాల్లో పండుగలు ఒకపక్క మరొక ప్రక్క స్థానిక ఎన్నికల వాతావరణం రావడంతో రూ.లక్షల వ్యయంతో మద్యం అమ్మకాలు జరిపి గ్రామాల్లో జోరుగా బెల్ట్ షాపుల దందా సాగుతున్నది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ, ఎక్సైజ్ అధికారుల కనుసైగల తోనే, బెల్ట్ షాపుల వ్యాపారం అధిక ధరలతో దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. దీనికి తోడు తుంగతుర్తి ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది ఏకంగా ఇతర వ్యక్తులు బెల్లం వ్యాపారం చేస్తుంటే వారికి ఏజెంట్గా మారి వారి అక్రమ బెల్లం దండాకు పైలెట్గా బండ్లు పెట్టి వ్యాపారం కొనసాగిస్తుండగా, తొర్రూరుకు చెందిన ఎక్సైజ్ టాస్క్ పోర్టు అధికారులు గడిచిన 10 రోజుల క్రితం గొట్టిపర్తిలో అక్రమ బెల్లం రవాణా చేస్తున్న డీసీఎం తో పాటు, పైలట్గా వెళ్ళిన కారు తుంగతుర్తి ఎక్సైజ్ సిబ్బందిది కావడం, పట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
దొరికిన బెల్లం మినీ డీసీఎం తో పాటు, ఎక్సైజ్ సిబ్బంది కారు కూడా పట్టుబడ్డది. అయినప్పటికీ వారి మీద ఎటువంటి చర్యలు స్థానిక ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ తీసుకోకపోవడం, నేడు సవాలుగా మారింది. కనీసం తుంగతుర్తి అధికారిని నీ వివరణ అడుగుదామని, స్థానిక రిపోర్టర్లు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ, ఎటువంటి సమాధానం రాకపోవడం గమనార్హం. జరిగిన సంఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ సూపర్డెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్ విచారణ జరిపి, తుంగతుర్తి ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.