calender_icon.png 16 December, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ వాయిదా

07-10-2025 02:53:17 PM

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై(Kaleshwaram Commission Report) దాఖలైన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు సమయం కోరింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao), మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎస్. కె. జోషి, స్మితా సబర్వాల్ కు హైకోర్టు ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులను సీజే ధర్మాసనం నవంబర్ 12 వరకు పొడిగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.