08-08-2025 01:12:04 AM
నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
భైంసా, ఆగస్టు ౭ (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేపట్టిన ధర్నా అంతా ఊటకమని బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే మోడీని గద్దె దించుతామని హెచ్చరించిన సీఎం తాను సీఎం గద్దె దిగిపోకుండా పదవిని కాపాడుకోవాలని బి జెఎల్‌పి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం బైంసా పట్టణంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదని ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పేరుతో తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పొందుతుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేయడం ఆశాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై ప్రేమ లేదని దాని వెనుక ముస్లిం మైనార్టీలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచేందుకు బీసీ రిజర్వేషన్లు వాడుకుంటున్నారని ఆరోపించారు. బీసీల ధర్నాలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు పాల్గొనలేదని సీఎం సమాధానం చెప్పాలన్నారు.
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పాలనను ప్రజలు మెచ్చి మూడోసారి అధికార పగ్గాలు ఇచ్చారని ప్రధానిగా మోడీని గద్దె దించి పని రాహుల్ గాంధీ సోనియా గాంధీకి సాధ్యం కాలేదని ఈ రేవంత్ రెడ్డికి ఏం సాధ్యమవుతుంది అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏ న్యాయం చేసిందో ప్రజలం దరికీ తెలుసా అని బీసీ కార్డు పేరుతో అమాయక ప్రజలను మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి బీసీ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగిందని ఆరోపించారు ఈ సమావేశంలో బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు.