7 August, 2026 | 2:29 AM

అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతి

07-08-2026 01:02 AM

సదాశివనగర్, ఆగస్టు 6 (విజయక్రాంతి): మండలంలోని మర్కల్ గ్రామ స్టేజి వద్ద గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో పెన్సిలిన్ అనే ఆంటీబయోటిక్ ని కనిపెట్టిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించారు.

మైక్రోబయాలజీ, జువాలజి, కెమిస్ట్రీ, బోటనీ విభాగాల ఆధ్వర్యంలో అలెగ్జాండర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి, జ్యోతిప్రజ్వలన చేసి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం పెన్సిలిన్ మందును కనిపెట్టడానికి ఆయన  చేసిన కృషి ని, వ్యాధులను నయం చేయడంలో పెన్సిలిన్ యొక్క ప్రాముఖ్యత ను గురించి విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గా డాక్టర్ శృతి సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ఫోరెన్సిక్ విచ్చేసి,  కెరీర్ ఆపర్చునిటీస్ గురించి వివరించారు. అలాగే నరేందర్ -ఫర్మేంటేషన్ మైక్రోబయాలజిస్ట్  విచ్చేసి ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి విద్యార్థులకు వివరించారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్విజ్, పవర్ పాయింట్ ప్రెసెంటేషన్, పోస్టర్ ప్రెసెంటేషన్, స్పీచ్, స్కిట్ వంటి పోటీలను నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో  హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ , డాక్టర్.ఉజ్మాసుల్తాన, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజి  డాక్టర్. కే. వనజ, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ సి. హెచ్. మీనా, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బోటనీ ఎం. నేహా, లైఫ్ సైన్సెస్ అధ్యాపకులు పి. సింధూర, బి. చంద్రకళ, కే. ఝాన్సీ మరియు ఇతర అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.